'కరివేపాకు' ఇలా తింటే ఎన్నో ప్రయోజనాలు

By సుభాష్  Published on  16 Feb 2020 11:58 AM GMT
కరివేపాకు ఇలా తింటే ఎన్నో ప్రయోజనాలు

► కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు

► ఉదయాన్నే నాలుగైదు ఆకులు తింటే..

► కరివేపాకులో ఏముంటుంది..

మన ప్రతి రోజు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కరివేపాకులు మన వంటిల్లో ఎప్పుడు ఉండేవే. ఉదయాన్నే కొన్ని కరివేపాకుల్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. కూరల్లో కరివేపాకులు వేస్తే ప్రత్యేక రుచి, మంచి వాసన వస్తుంది. కూరల్లో వేసిన కరివేపాకులు కొందరు తినేందుకు ఇష్టపడరు. తినే ముందు కూరల్లోంచి తీసి పక్కనపడేస్తుంటారు. వీటితో ఉండే ఈ ప్రయోజనాలు తెలిస్తే ఇక వదలరు.

ఇవి మన చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతో ఉపయోగపడతాయి. ఉదయం పూట కొన్ని కరివేపాకులు మన పొట్టలో వేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు. మొదట్లో కాస్త చేదుగా అనిపించినా.. రానురాను అలవాటు అయిపోతుంటుంది. కరివేపాకు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూసేద్దాం.

ఉదయాన్నే కరివేపాకులను నమలడం వల్ల ఉపయోగాలు:

ఉదయన్నే కరివేపాకులు తినడం వల్ల జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది. ఉదయం నిద్ర లేవగానే ఓ గ్లాస్‌ మంచినీరు తాగాలి. కొన్ని నిమిషాల తర్వాత ఓ నాలుగైదు కరివేపాకుల్ని నోట్లో వేసుకుని నమిలివేయాలి. ఆ తర్వాత అరగంట పాటు ఏమి తినకుండా ఉండాలి. కరివేపాకుల్లో విటమిన్‌-సి, పస్పరస్‌, ఐరన్‌, కాల్షియం, నికోటినిక్‌ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. కూరల్లో కూడా కరివేపాకుల్నిఎక్కువగా వాడితే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

Next Story
Share it