క్యూరియాసిటీ రోవర్ పంపిన కొత్త ఫోటోలు ఇవే
By అంజి Published on 9 March 2020 9:29 AM GMTమార్స్ ఉపరితలానికి చెందిన ప్రాంతాలను నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ హై రిజల్యూషన్తో చిత్రీకరించింది. ఈ ఫోటోలను నాసా తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ ఫోటోల్లో లాంగ్ షాట్‌లో రోవర్ తీసిన ఫోటోలు అంగారక గ్రహంపై ఉండే సువిశాల ప్రాంతాలను చూపిస్తున్నాయి.
అంగారక గ్రహంపై సూక్ష్మజీవులు స్ధిర నివాసం ఏర్పరచుకునే అనుకూల పర్యావరణ పరిస్ధితులు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆగస్టు 5న మార్టిన్ ఉపరితలంపై నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ 2012 కాలుమోపింది. రోవర్ 21.92 కిలోమీటర్లు ప్రయాణించి, రెడ్ ప్లానెట్‌లో మొత్తం 654,661 చిత్రాలను తీసింది. నాసా క్యూరియాసిటీ రోవర్ 2.43 .జీబీ ఫైలు పరిమాణాన్ని కలిగి ఉన్న మార్స్ యొక్క అత్యధిక-రిజల్యూషన్ కలిగిన అంగారక సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించే 1000 ఫోటోలను విడుదల చేసింది. 360-డిగ్రీల అనుభూతిని ఆస్వాదించేలా ఉన్న ఈ చిత్రాలు , 2019 నవంబర్ 24 - డిసెంబర్ 1 మధ్య తీసినవి.
దీనికిగానూ రోవల్ 1.8 బిలియన్ పిక్సల్స్ కలిగిన కెమెరాలను వినియోగించింది. రోవర్‌కు చెందిన 'మాస్ట్‌కామ్'ను తన టెలీస్కోప్ లెన్స్‌ను వినియోగించి ఈ ఫొటోలన్నింటినీ అసెంబుల్ చేసిన తర్వాత నాసా శాస్తవేత్తలు తాజాగా వాటిని విడుదల చేశారు. అయితే ఇందులో రోవర్ మాత్రం కనిపించడం లేదు. 650 మిలియన్ పిక్సల్స్ రెజల్యూషన్‌తో తీసిన మరో ఫొటోలో మార్స్ ఉపరితలంతో పాటు రోవర్ కూడా కనిపించడం గమనార్హం. ఈ రెండు ఫొటోల్లో కూడా కొంత ఎత్తైన కొండలు లాంటి ప్రాంతాలు అందులో కనిపించాయి.
ఈ రోవర్ వ్యక్తిగత షాట్లను తీసేందుకు నాలుగు రోజులలో ఆరున్నర గంటలకు పైగా సమయం అవసరం.