దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఢిల్లీలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా సీఆర్పీఎఫ్‌ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో.. ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్(సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్) హెడ్‌క్వార్ట‌ర్స్ భ‌వ‌నాన్ని మూసివేశారు. కార్యాల‌యం మొత్తాన్ని శానిటేష‌న్ చేయ‌నున్నారు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు భ‌వ‌నంలోకి ఎవ్వ‌రికి అనుమ‌తించ‌రు. సీఆర్‌పీఎఫ్‌లో కరోనా కలకలం రేపిన విష‌యం తెలిసిందే. ఇప్పటివరకూ 31వ బెటాలియన్‌కు చెందిన 122 మంది జవాన్లు క‌రోనా బారీన ప‌డ్డారు.

భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 39,980 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డి 1301 మంది మ‌ర‌ణించారు. మొత్తం న‌మోదైన కేసుల్లో 10,633 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 28,046 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఢీల్లిలో ఇప్ప‌టి వ‌ర‌కు 4122 కేసులు న‌మోదు కాగా.. 64మంది మర‌ణించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *