గ్రేటర్ నోయిడాలోని మొహమ్మద్‌పూర్ గుర్జార్ గ్రామంలో ఒక యూట్యూబర్ సోమవారం మరణించాడు. ఓ పార్టీలో చాలా మంది వ్యక్తులు అతన్ని కొట్టారు. ఆ తర్వాత అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి, ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు దీపక్ జనవరి 28, ఆదివారం మనీష్ అనే వ్యక్తి ఇంట్లో పార్టీకి వెళ్లాడని, అక్కడ అందరూ మద్యం సేవించారని అదనపు డీసీపీ అశోక్ కుమార్ శర్మ తెలిపారు. దీపక్‌కి ఏదో ఒక విషయంపై వివాదం వచ్చింది, ఆ తర్వాత మనీష్‌తో పాటు మరికొందరు అతన్ని కొట్టారు.
దీపక్ తలపై కొట్టారని, గొడవ విరమించుకున్న తర్వాత ఇంటికి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. అయితే ఇంటికి చేరిన ఒకటి రెండు గంటల్లోనే ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. దీపక్ తలలో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దీపక్ చనిపోయిన తర్వాత అదే గ్రామానికి చెందిన ఆరుగురిపై దీపక్ కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.