గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్‌లో గొడవ.. ఉరేసుకున్న యువకుడు

Youth ends life on video call with girlfriend in delhi. దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే హరిద్వార్ నుండి కన్వర్ యాత్ర ముగించుకుని

By అంజి  Published on  29 July 2022 3:32 PM IST
గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్‌లో గొడవ.. ఉరేసుకున్న యువకుడు

దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే హరిద్వార్ నుండి కన్వర్ యాత్ర ముగించుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన 19 ఏళ్ల యువకుడు ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన స్నేహితురాలితో వీడియో కాల్ ద్వారా మాట్లాడాడు. మృతుడు ప్రశాంత్ తన తండ్రితో కలిసి ఇటీవలే హరిద్వార్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. అతను తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న సమయంలో.. ఇద్దరి మధ్య ఏదో విషయమై వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలోనే ఆ యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్స్ లభించలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడితో మాట్లాడిన ఆ అమ్మాయి ఎవరు, వీడియో కాల్‌లో అసలు ఏం జరిగిందన్న కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ కొనసాగుతోంది. కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో తండ్రి బోరున విలపిస్తున్నాడు.

Next Story