కుల బహిష్కరణ : మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య

Youngman Commit Suicide In Medak. మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  23 Feb 2021 9:33 AM GMT
Youngman Commit Suicide In Medak,

మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ అనే యువకుడి కుటుంబాన్ని కుల పెద్దలు కుల బహిష్కర‌ణ చేశారు. ఈ విష‌య‌మై గ్రామానికి చెందిన ముగ్గురు కుల పెద్దలపై.. ఇప్ప శంకర్ జనవరి 6న అల్లా దుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు.

అయితే.. ఫిర్యాదుపై పోలీసులు పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన ఇప్ప శంకర్.. సోమ‌వారం అర్ధరాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. ఆత్మహత్యకు ముందు తన ఆవేద‌న‌ను వీడియో రికార్డు చేసి అనువు చాలించాడు శంక‌ర్‌. కుల‌పెద్ద‌లు, పోలీసుల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.


Next Story