ప్రేమకు నిరాకరించిందని.. డ్రెస్‌ మార్చుకుంటుండగా యువతిని గొంతు కోసి హత్య

Young woman found murdered home.. kerala cops begin probe. కేరళలోని కన్నూర్‌లోని తన నివాసంలో ఒక యువతి దారుణంగా హత్యకు గురైంది. ప్రేమిస్తే కాదన్నదని ఓ

By అంజి  Published on  23 Oct 2022 1:16 PM IST
ప్రేమకు నిరాకరించిందని.. డ్రెస్‌ మార్చుకుంటుండగా యువతిని గొంతు కోసి హత్య

కేరళలోని కన్నూర్‌లోని తన నివాసంలో ఒక యువతి దారుణంగా హత్యకు గురైంది. ప్రేమిస్తే కాదన్నదని ఓ యువతిపై కోపంతో యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని టైమ్‌ చూసుకుని ఆమె గొంతు కోసి పరారయ్యాడు. కుటుంబసభ్యులు సమచారంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కన్నూర్​కు చెందిన విష్ణుప్రియ అనే యువతి ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తోంది.

ఈ క్రమంలోనే కూతుపరంబాకి చెందిన శ్యామ్​జిత్​ అనే యువకుడు లవ్‌ చేయాలని యువతిని ఒత్తడి చేశాడు. అయితే ఆ యువతి ప్రేమకు నిరాకరించింది. దీంతో ఆ యువతిని శ్యామ్‌జిత్‌ హత్య చేయాలనుకున్నాడు. సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లిన యువతిని ఓ కంట కనిపెట్టుకుంటూ వచ్చాడు. అంత్యక్రియల్లో పాల్గొన్న కాసేపటికే ఆ యువతి డ్రెస్​ మార్చుకునేందుకు ఇంటికి వచ్చింది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న నిందితుడు.. ఇంట్లోకి చొరబడి ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. ఇంటికి వెళ్లిన యువతి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు అనుమానంతో ఇంటికి వచ్చారు. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న యువతి మృతదేహాన్ని చూసి షాకయ్యారు.

ఆమె మెడతో పాటు చేతిపైన కత్తితో పొడిచిన గాయాలున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో మాస్క్​ వేసుకున్న ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య నేరం జరిగింది. "అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతను నేరం చేసిన వ్యక్తి కాదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. విచారణ కొనసాగుతోంది" అని పోలీసు అధికారి తెలిపారు.

Next Story