'అమ్మా, నాన్నా మ‌ళ్లీ మీ ముందు ఓడిపోయా'.. ప్రేమికుడి బొమ్మగీసి యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

Young Woman ends life in Mahabubabad District.ప్రేమించిన వ్య‌క్తి వివాహం చేసుకునేందుకు నిరాక‌రించాడ‌ని ఓ యువ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2022 8:43 AM IST
అమ్మా, నాన్నా మ‌ళ్లీ మీ ముందు ఓడిపోయా.. ప్రేమికుడి బొమ్మగీసి యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

ప్రేమించిన వ్య‌క్తి వివాహం చేసుకునేందుకు నిరాక‌రించాడ‌ని ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. 'అమ్మా.. నాన్నా మ‌ళ్లీ మీ ముందు ఓడిపోయా.. అంద‌రి ముందు ప్ర‌శ్న‌గా మిగిపోయా.. పెద్ద మ‌నుషుల స‌మ‌క్షంలో మ‌ళ్లీ ఆరెల్ను గ‌డువు పెడితే త‌న‌ను న‌మ్మి మ‌రోసారి ఓడిపోయా. ఏం చేయాలో అర్థంకాట్లేదు.. నాకు బ‌త‌కాల‌ని లేదు' అని ఆ యువ‌తి సూసైడ్ నోటులో రాసింది. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన శ‌ర‌ణ్య(22) ఇంట‌ర్ వ‌ర‌కు చదువుకుంది. కుట్టుమిష‌న్ నేర్చుకుని ఇంటి వ‌ద్ద‌నే ఉంటుంది. ఇక అదే గ్రామానికి చెందిన ఓ యువ‌కుడు, శ‌ర‌ణ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అత‌డు ఓ ప్ర‌జాప్ర‌తినిధి వ‌ద్ద డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.పెళ్లి విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో పెద్ద మ‌నుషుల స‌మ‌క్షంలో పంచాయ‌తీ పెట్టారు. కొంత స‌మ‌యం కావాల‌ని ప్రియుడు కోరాడు. అత‌డు చెప్పిన స‌మ‌యం కూడా అయిపోయినా అత‌డు మాత్రం పెళ్లి చేసుకునేందుకు మ‌రో ఆరు నెల‌ల స‌మ‌యం కావాల‌ని చెప్పాడు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన శ‌ర‌ణ్య ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో.. సూసైడ్ నోటు రాసి, ప్రియుడి బొమ్మ‌గీసి మంగ‌ళ‌వారం సాయంత్రం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కాగా.. యువతి మృత‌దేహాన్ని యువకుడి ఇంటి ముందుకు తీసుకొచ్చి బంధువులు ఆందోళన చేశారు. యువ‌తి మృతిపై ఫిర్యాదు ఇస్తే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.

Next Story