విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువ‌తిపై ఓ యువ‌కుడు పెట్రోస్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువ‌తి అక్క‌, ఆమె కుమారుడికి కూడా మంట‌లు అంటున్నాయి. ఈ దారుణ ఘ‌ట‌న పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. చౌడ‌వాడకు చెందిన యువ‌తితో న‌ర‌వ‌కు చెందిన రాంబాబుకు వివాహం నిశ్చ‌మైంది. అయితే.. ఆ యువ‌తి మ‌రో యువ‌కుడితో మాట్లాడుతోంద‌ని రాంబాబు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేయ‌డంతో పాటు పెళ్లిని ర‌ద్దు చేసుకున్నాడు.

ఈ విష‌య‌మై ఇరు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు కుటుంబాల‌ను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు. పోలీసుల సూచ‌న‌తో వివాహం చేసుకునేందుకు రాంబాబు అంగీక‌రించాడు. అయితే.. ఏం జ‌రిగిందో తెలీదు కానీ నిన్న అర్ధ‌రాత్రి స‌మ‌యంలో యువ‌తిపై రాంబాబు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుబోయిన యువ‌తి అక్క‌, ఆమె కుమారుడికి కూడా మంట‌లు అంటుకున్నాయి. స్థానికులు గ‌మ‌నించి మంట‌ల‌ను ఆర్పి ముగ్గురిని విజ‌యన‌గ‌రం జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story