ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువ‌కుడు

Young man strangled the girl in Suryapet dist.సూర్యాపేట జిల్లాలో దారుణం జ‌రిగింది. త‌న‌ ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2021 9:33 AM GMT
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువ‌కుడు

సూర్యాపేట జిల్లాలో దారుణం జ‌రిగింది. త‌న‌ ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌ని ఓ ప్రేమోన్మాది.. యువ‌తి గొంతు కోసి ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న నేరేడు చ‌ర్ల మండ‌లంలో అరవింద డిగ్రీ కాలేజ్ సమీపంలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. గ‌త కొంత‌కాలంగా బాల‌సైదులు అనే వ్య‌క్తి ఓ యువ‌తిని ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డుతున్నారు. అయితే.. ఆ యువ‌తి అత‌డి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. అయిన‌ప్ప‌టికి త‌న‌ను ప్రేమించాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు.

కాగా.. ఆ యువ‌తికి మ‌రొక‌రితో పెళ్లికుదిరింద‌ని తెలుసుకుని ఆగ్ర‌హాంతో ఊగిపోయాడు. గురువారం ఉద‌యం యువ‌తి త‌న స్నేహితుల‌తో క‌లిసి బ‌ట్ట‌లు ఉతికేందుకు స‌మీపంలో ఉన్న కాల్వ వ‌ద్ద‌కు వెళ్లింది. అక్క‌డికి బాల‌సైదులు వ‌చ్చాడు. యువ‌తి గొంతు కోసి ప‌రార‌య్యాడు. గ‌మ‌నించిన స్థానికులు ఆ యువ‌తిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. యువ‌తి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు.

Next Story
Share it