ఆటోలో వచ్చిన ఇద్దరు దుండగులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన జగద్గిరిగుట్టలోని సంజయ్‌గాంధీ నగర్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దేవమ్మ బస్తీకి చెందిన సురేశ్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. రోషన్, రోహిత్‌లు అనే ఇద్దరు శుక్రవారం రాత్రి ఆటోలో సంజయ్‌గాంధీ నగర్‌కు వచ్చారు. పెయింటర్ సురేశ్‌పై కత్తులతో దారుణంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. గమనించిన స్థానికులు సురేశ్ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పాయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ హత్యకు పాత కక్ష్యలే కారణమని పోలీసులు తెలిపారు.