షటిల్ ఆడుతుండ‌గా వివాదం.. ఓ యువ‌కుడి ప్రా‌ణం తీసింది

Young Man Killed In Nellore. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కోళ్లమిట్ట సెంటర్ లో రాత్రి 10గంటలకు షటిల్ ఆడుతున్నసమయంలో చోటుచేసుకొన్న ఓ వివాదం హింసగా మారింది. ఓ యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపారు.

By Medi Samrat  Published on  5 Feb 2021 9:12 AM IST
Young Man Killed In Nellore
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కోళ్లమిట్ట సెంటర్ లో రాత్రి 10గంటలకు షటిల్ ఆడుతున్నసమయంలో చోటుచేసుకొన్న ఓ వివాదం హింసగా మారింది. ఓ యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపారు. ప్రాధమిక సమాచారం మేరకు ఓ 10మంది వ్యక్తులు షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో అనిల్ కుమార్, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులతో పవన్, సాయి అనే యువకులు ఘర్షణకు దిగారు. దూషణల క్రమంలో హఠాత్తుగా సమీపంలోని ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన కత్తితో అనిల్ కుమార్ అనే యువకుడిపై విచక్షణ రహితంగా దాడిచేసి చంపేశారు. మరో యువకుడు మణికంఠకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థ‌లానికి చేరుకొని సమీప హాస్పిటల్‌కు తరలించారు.


Next Story