సినిమాలోని కథానాయికలా మోక్షం పొందాలని.. ఆత్మహత్య
Young man inspired by A movie dies by self immolation.ఎంత కాదన్నా సినిమాల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అనేది కాదనలేని
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2022 12:43 AM GMTఎంత కాదన్నా సినిమాల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అనేది కాదనలేని వాస్తవం. సినిమాల్లో హీరోలు చేసే పనులను బయట కొందరు అనుకరిస్తుంటారు కూడా. సినిమాకి నిజ జీవితానికి చాలా తేడా ఉంటుంది. అయితే.. ఓ వ్యక్తి సినిమాని చూసి అందులో కథానాయిక ఎలా చనిపోయిందో అలా చనిపోయి మోక్షం పొందాలని ప్రయత్నించి కన్నవారికి తీరని ఆవేదన మిగిల్చాడు.
కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలోని ఓ గ్రామంలో రేణుకా ప్రసాద్(23) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇంటర్ పరీక్షలు తప్పడడంతో అప్పటి నుంచి గ్రామంలోనే ఖాళీగా ఉండేవాడు. ఏదో ఒక పని చూసుకోమని తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పటికీ వారి మాటలను లెక్కచేసేవాడు కాదు. ఈ క్రమంలోనే సినిమాలు చూసేవాడు. సినిమాలకు ఎంతలా అడిక్ట్ అయ్యాడంటే చిత్రాల్లో ఏం చేస్తే అలా చేసేయాలనేంతగా వ్యామోహం పెంచుకున్నాడు.
చాలా ఏళ్ల క్రితం విడుదలైన 'అరుంధతి' చిత్రం అంటే అతడికి చాలా ఇష్టం అట. ఈ సినిమాని ఓ 25 సార్లు అయిన చూశాడు. తాను ఆ చిత్రంలోని కథానాయికలా ఆత్మహత్య చేసుకుంటే మోక్షం లభిస్తుందని, పునర్జన్మ ఉంటుందని విశ్వసించాడని గ్రామస్తులు చెబుతున్నారు. అది సినిమా అని నిజ నిజజీవితంలో అలా చేయడం సాధ్యం కాదని పలుమార్లు స్నేహితులు, తల్లిదండ్రులు అతడిని వారించారు.
అయినప్పటికి గత బుధవారం గ్రామ శివార్లలో పెట్రోల్‌ను పోసుకుని నిప్పంటించుకున్నాడు. తాను ప్రాణ త్యాగం చేసి మోక్షం పొందుతున్నానని సెల్‌ఫోన్‌లో సెల్పీ వీడియో తీసి, తన తండ్రికి పంపించాక నిప్పంటించుకున్నాడు. అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.