తూర్పుగోదావరిలో దారుణం.. పెళ్లి పేరుతో యువతిని నమ్మించి.. కోరిక తీర్చుకుని..

Young man held for deceiving a girl under pretext of marriage in East Godavari. యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడో యువకుడు. యువకుడి మాటలు

By అంజి  Published on  6 Nov 2022 2:12 PM IST
తూర్పుగోదావరిలో దారుణం.. పెళ్లి పేరుతో యువతిని నమ్మించి.. కోరిక తీర్చుకుని..

యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడో యువకుడు. యువకుడి మాటలు నమ్మి అతడితో ప్రేమలో పడిపోయింది యువతి. అతడే తన సర్వస్వం అనుకుని.. చెప్పిందల్లా చేసింది. అయితే తన కోరికలు తీర్చుకున్నాక ముఖం చాటేశాడు. దీంతో యువకుడి అసలు రూపం వెలుగులో వచ్చింది. మోసపోయానని గ్రహించి వెంటనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యువతిని మోసగించిన కేసులో తూర్పుగోదావరి రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కొండ్రు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పట్టణ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వాడపల్లికి చెందిన యువతి రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, ప్రేమ్‌ కుమార్ సమీపంలోని ఓ స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ సారి వస్త్ర దుకాణంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమలో పడ్డారు. ప్రేమ్‌కుమార్‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, తన అవసరాలు తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరించి మోసం చేశాడు. అయితే బాధితురాలి ఫిర్యాదుతో ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story