ప్రేమ విఫలం.. యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

అత్తాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలమయిందని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

By Kalasani Durgapraveen  Published on  7 Nov 2024 10:09 AM IST
ప్రేమ విఫలం.. యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

అత్తాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలమయిందని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికుమార్ అనే యువకుడు బుధ‌వారం అర్ధరాత్రి సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. సాయి కుమార్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా కాగా.. చదువుకోవడానికి హైదరాబాద్ నగరానికి వచ్చి అత్తాపూర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా ఎలక్ట్రిషన్ పని చేసుకుంటూ విద్యాబ్యాసం కొనసాగిస్తున్నాడు. ఆత్మ‌హ‌త్యపై స‌మాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు‌. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story