చిత్తూరులో ప్రేమోన్మాది ఘాతుకం

Youn man attackes on woman in Chittor.దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు.చిత్తూరులో ప్రేమోన్మాది ఘాతుకం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2021 4:20 PM IST
Young man attacks on a woman in Chittor.

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. యువ‌తి ప్రేమించ‌క‌పోవ‌డంతో ఓ ప్రేమోన్మాది క‌త్తితో యువ‌తిపై దాడి చేశాడు. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్యంలోనే ఆ యువ‌తి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. పెనుమూరు మండ‌లం తూర్పుప‌ల్లి గ్రామానికి చెందిన గాయ‌త్రి(20) మంగ‌ళవారం త‌మ బంధువ‌ల అమ్మాయితో క‌లిసి ద్విచ‌క్ర‌వాహ‌నం పై ఇంటికి వెలుతోంది. పోత‌న‌పెట్టు మండ‌లం చింత‌మాకుల‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఢిల్లీబాబు ఆమెను దారిలో అడ్డ‌గించి.. క‌త్తితో తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. యువ‌తి పొట్ట‌భాగంలో తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే యువ‌తిని బంధువులు పెనుమూరు ఆస్ప‌త్రికి త‌ర‌లించి ప్రాథ‌మిక చికిత్స అందించారు. అనంత‌రం మెరుగైన వైద్యం కోసం త‌మిళ‌నాడులోని వేలూరు ఆస్ప‌త్రికి తీసుకెలుతుండ‌గా.. గాయత్రి మార్గ‌మ‌ధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఢిల్లీబాబు ప‌రారీలో ఉన్నాడు.

Next Story