పెళ్లైన మూడు రోజులకే గ‌ర్భం..ముగ్గురితో వివాహం.. దిమ్మ‌దిరిగే ట్విస్టులు

Women marriage three mens in AP.ఇటీవ‌ల కాలంలో కీలేడీలు రెచ్చిపోతున్నారు. అక్ర‌మ సంబంధాల మోజులో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2021 7:24 AM GMT
పెళ్లైన మూడు రోజులకే గ‌ర్భం..ముగ్గురితో వివాహం.. దిమ్మ‌దిరిగే ట్విస్టులు

ఇటీవ‌ల కాలంలో కీలేడీలు రెచ్చిపోతున్నారు. అక్ర‌మ సంబంధాల మోజులో క‌ట్టుకున్న భ‌ర్త‌ల‌ను క‌డ‌తేర్చిన ఘ‌ట‌నలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ మ‌హిళ‌.. వివాహం అనే ప‌దాన్ని అప‌హాస్యం చేసింది. ప్రియుడితో సంబంధాన్ని కొన‌సాగిస్తూనే ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. చివ‌రికి రెండో భ‌ర్త ఇచ్చిన ఫిర్యాదుతో కిలేడీ వ్య‌వ‌హారం వెలుగు చూసింది.

విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన ఓ యువ‌తి శ్రీనివాస్ అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డింది. అత‌డితో అన్ని హ‌ద్దులు దాటింది. ఈ విష‌యాన్ని ఇంట్లో చెప్ప‌లేదు. ఈ విష‌యం తెలియ‌ని పెద్ద‌లు ఆ యువ‌తికి జగదీష్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే.. వివాహం అయిన మూడు రోజుల‌కే భార్య గ‌ర్భ‌వ‌తి అని తేలియ‌డంతో భ‌ర్త ఆమెను వ‌దిలివేశాడు. దీంతో శ్రీనివాస్ వ‌ద్ద‌కు వెళ్లింది ఆ యువ‌తి.. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని కోరింది. అత‌డు పెళ్లిని వాయిదా వేస్తూ రావ‌డంతో ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చింది.

ఈ లోపు శ్రీనివాస్ మ‌రో యువ‌తితో పెళ్లికి సిద్ద‌మ‌య్యాడు. పాప బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని కొంత న‌గ‌దు డిపాజిట్ చేస్తాన‌ని ఆ యువ‌తికి చెప్పి పెద్ద‌లు చూసిన మ‌రో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆ యువ‌తికి త‌న కుటుంబంలో బాగా డ‌బ్బున్న వ్య‌క్తిని చూపించి అత‌డిని వివాహం చేసుకోవాల‌ని సూచించాడు. ఆర్మీ ఉద్యోగి అయిన ప్ర‌సాద్‌ను వ‌ల‌లో వేసుకుని సీక్రెట్‌గా పెళ్లిచేసుకుంది. ఉద్యోగ రీత్యా లక్నోలో ఉంటున్న ప్రసాద్ తన వెంటనే భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. అయితే.. అక్క‌డ ఆ యువ‌తి అత‌డి చేత బంగారు ఆభ‌ర‌ణాలు, ఇత‌ర వ‌స్తువులు కొనిపించుకుంది. ద‌శ‌ల‌వారీగా రూ.90ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుని ఏదో క‌ట్టుక‌థ చెప్పి గాజువాక వ‌చ్చేసింది. ఇక్క‌డకు వ‌చ్చి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న సాయి అనే యువకుడ్ని మరో పెళ్లి చేసుకుంది.

త‌న భార్య గాజువాక వెళ్లి.. తిరిగి రాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన రెండో భ‌ర్త ప్ర‌సాద్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసుల‌కు దిమ్మ‌దిరిగే నిజాలు తెలిశాయి.

Next Story
Share it