దారుణం.. మ‌త్తుమందు ఇచ్చి.. యువతిపై నెల రోజులుగా 60 మంది అత్యాచారం..!

Women gang raped in Jharkhand. ఓ యువ‌తిని ఓ గ్యారేజీలో బంధించి నెల‌రోజులుగా 60 మంది అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2021 3:49 AM GMT
Women gang raped in Jharkhand

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చినప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నా మాకేం సిగ్గు అంటూ కామాంధులు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ రెచ్చిపోతున్నారు. ఆడ‌వారు క‌నిపిస్తే చాలు చిత్త కార్తె కుక్క‌ల్లా రెచ్చిపోతున్నారు. ఇంకా దారుణ‌మైన విష‌యం ఏంటంటే ఈ మ‌ధ్య సామూహిక అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. ఓ యువ‌తిని ఓ గ్యారేజీలో బంధించి నెల‌రోజులుగా 60 మంది అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న ఝార్ఖండ్ రాష్ట్రంలో జ‌రిగింది.

ఓ యువతిని బంధించిన దుండగులు నెలరోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బహిర్భూమి కోసం వెళ్తున్నట్టు చెప్పిన ఆమె వారి నుంచి చాకచక్యంగా తప్పించుకోవ‌డంతో ఈ దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. సరాయ్‌కేలా-ఖర్‌సావా జిల్లాలోని కందర్‌బేరా సమీపంలో ఓ మూతపడిన గ్యారేజీలో తనను నెల రోజులపాటు బంధించారని చెప్పింది. త‌న‌కు డ్ర‌గ్స్ ఇచ్చి త‌న‌పై అఘాయిత్యం చేసేవార‌ని.. మాట విన‌క‌పోతే తీవ్రంగా కొట్టి హింసించేవార‌ని చెప్పింది.

నెల‌రోజుల్లో 60 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి తెలిపింది. గురువారం బ‌హిర్భూమికి వెళ్లాల‌ని చెప్పి వారి నుంచి త‌ప్పించుకువ‌చ్చిన‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం ఆ యువ‌తి అనారోగ్యంతో బాధపడుతోందని.. అంతకుమించిన వివరాలు చెప్పలేకపోతోందని పోలీసులు తెలిపారు. కాగా.. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలు కోలుకున్న త‌రువాత పూర్తి వివ‌రాలు తెలియ‌జేస్తామ‌న్నారు.


Next Story
Share it