బాసర సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తల లేని, నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలం మిట్టపూర్ శివార్లలోని హైవే పక్కన మృతదేహాన్ని పడవేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మృతదేహాన్ని రోడ్డు పక్కన గుర్తించిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకోవడానికి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కాగా డేడ్‌బాడీకి తల లేకపోవడంతో పాటు చేతుల వేళ్లు కూడా సగం వరకు తెగిపడి ఉన్నాయి. మహిళ వయస్సు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. డెడ్‌బాడీ నగ్న స్థితిలో ఉండటంతో అత్యాచారం చేసి మర్డర్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వేరే దగ్గర చంపి ఇక్కడ పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.