చెంపపై కొట్టాడని.. భర్తపై యాసిడ్‌లో కారంపొడి కలిపి పోసిన భార్య

Woman throws acid mixed with chilli powder at husband for slapping her. మద్యానికి బానిసైన ఓ భర్త.. తన భార్య చెంపపై కొట్టాడు. దీంతో కోపంతో రగిలిపోయిన భార్య కారం పొడి కలిపిన యాసిడ్‌ను భర్తపై

By అంజి  Published on  4 Aug 2022 10:31 AM GMT
చెంపపై కొట్టాడని.. భర్తపై యాసిడ్‌లో కారంపొడి కలిపి పోసిన భార్య

మద్యానికి బానిసైన ఓ భర్త.. తన భార్య చెంపపై కొట్టాడు. దీంతో కోపంతో రగిలిపోయిన భార్య కారం పొడి కలిపిన యాసిడ్‌ను భర్తపై పోసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో భర్తకు 40 శాతానికి పైగా కాలిన గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భర్త మొహమ్మద్ యాసీన్ మద్యానికి బానిసయ్యాడు. రోజు మద్యం తాగొచ్చి భార్య ఫర్హాతో పాటు తన నాలుగేళ్ల కుతూరు కొట్టేవాడు.

రెండు రోజుల క్రితం మద్యం సేవించి ఇంటికి వచ్చిన యాసీన్‌ తన భార్య చెంపపై కొట్టాడు. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాడు. అయితే భర్త కొట్టడంతో భార్య ఫర్హా రగిలిపోయింది. కోపంతో యాసిడ్‌లో కారంపొడి కలిపి నిద్రిస్తున్న భర్తపై పోసింది. దీంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. "అతడి శరీరంలోని చాలా చోట్ల కాలిన గాయాలు అయ్యాయి" అని జిల్లా ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.

పోలీసు అధికారి మాట్లాడుతూ.. "భర్త బంధువుల నుండి ఫిర్యాదును అనుసరించి, ఐపిసి సెక్షన్ 326 కింద భార్య ఫర్హాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అతను కోలుకున్న తర్వాత, వెంటనే మేము అతని వాంగ్మూలాన్ని నమోదు చేస్తాము. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాము'' అని తెలిపారు. మరో వైపు ఘటన జరిగిన తర్వాత ఫర్హా, తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.

Next Story