పార్కులో కూర్చున్న యువతిని కారులోకి లాగి సామూహిక అత్యాచారం

బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పార్క్‌లో కూర్చున్న యువతిని బలవంతంగా కారులోకి లాగి ముగ్గురు

By అంజి  Published on  31 March 2023 11:25 AM IST
Bengaluru, Crime news

పార్కులో కూర్చున్న యువతిని కారులోకి లాగి సామూహిక అత్యాచారం 

బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పార్క్‌లో కూర్చున్న యువతిని బలవంతంగా కారులోకి లాగి ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కోరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులను సతీష్, విజయ్, శ్రీధర్, కిరణ్‌లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 25 అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. నేషనల్ గేమ్స్ విలేజ్ పార్క్ వద్ద యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కూర్చుంది.

నిందితులు అతడి స్నేహితురాలిని బెదిరించి కారులోకి లాగారు. కదులుతున్న కారులో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. నిందితులు దోమలూరు, ఇందిరానగర్‌, అనేకల్‌, నైస్‌రోడ్డు వరకు కారు నడిపి రాత్రంతా ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు ఆమెను మార్చి 26 తెల్లవారుజామున ఆమె నివాసం దగ్గర వదిలి వెళ్ళారు. తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి చేరుకున్న తరువాత, బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story