అత్యాచారం చేసి.. 10వ అంతస్తు నుంచి తోసేశాడు
Woman raped thrown off 10th floor in Kanpur.ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 24 Sept 2021 2:46 PM ISTఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తన వద్ద పనిచేస్తున్న యువతిపై కన్నేసిన ఓ వ్యక్తి.. ఆమెను ప్లాట్‌కు తీసుకువెళ్లాడు. బాధితురాలిని లొంగదీసుకునేందుకు యత్నించగా.. యువతి ప్రతిఘటించింది. నగదు ఆశ చూపినా యువతి లొంగకపోవడంతో అత్యాచారం చేశాడు. అనంతరం పదో అంతస్తు పై నుంచి కిందకు తోసేశాడు. ప్రమాదా వశాత్తు చనిపోయిందని నమ్మించే యత్నం కూడా చేశాడు. ఈ పాశవిక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రతీక్ వైశ్(40) అనే వ్యక్తి డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద 19 ఏళ్ల యువతి పనిచేస్తోంది. ఆమె పై కన్నేశాడు ప్రతీక్. మంగళవారం పని ఉందని చెప్పి గుల్ మొహర్ లో ఉన్న తన ప్లాట్‌కు యువతిని తీసుకువెళ్లాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని.. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని యువతిని ప్రలోభపెట్టాడు. అయితే.. యువతి ఇందుకు నిరాకరించింది. దీంతో యువతిపై అత్యాచారం చేశాడు. యువతి ఈ విషయాన్ని పోలీసులకు చెబుతానని అనడంతో.. ప్రతీక్ కిరాతకంగా ప్రవర్తించాడు.
పదో అంతస్తులో తాను నివసిస్తోన్న ఫ్లాట్ బాల్కానీ నుంచి కిందకు తోసేశాడు. దీంతో యువతి అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాదవశాత్తు యువతి కిందపడిందని అందరి నమ్మించే యత్నం చేశాడు. పోలీసులు అనుమానంతో నిందితుడిని విచారణ చేయగా.. అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. బుధవారం నిందితుడు ప్రవీక్ వైశ్ ను అరెస్టు చేసి కోర్టు అనుమతితో జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బీబీజీటీఎస్ మూర్తి చెప్పారు.