పంజాగుట్ట‌లో దారుణం.. బ్యాంకు ఉద్యోగులమని చెప్పి.. యువ‌తిపై అత్యాచారం

Woman raped by fake bank employees.పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో దారుణం జ‌రిగింది. ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులం అంటూ ఇంట్లోకి చొర‌బ‌డిన ఓ ఇద్ద‌రూ వ్య‌క్తులు యువ‌తిని నిర్భందించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2021 1:07 PM IST
Woman raped by fake bank employees

పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో దారుణం జ‌రిగింది. ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులం అంటూ ఇంట్లోకి చొర‌బ‌డిన ఓ ఇద్ద‌రూ వ్య‌క్తులు యువ‌తిని నిర్భందించారు. అనంత‌రం ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. డీఎస్ మ‌క్తాలో ఓ కుటుంబం నివ‌సిస్తోంది. ఇటీవ‌ల ఆ ఇంటిలోని కుటుంబ స‌భ్యులు మ‌హారాష్ట్ర‌కు వెళ్లగా.. యువ‌తి (23) ఇంట్లోనే ఒంట‌రిగా ఉంటోంది. మంగ‌ళ‌వారం సాయంత్రం ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ ఇంటికి వ‌చ్చారు. తాము ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులం అని ఫైనాన్స్ ఇప్పిస్తామ‌ని ఆమెతో చెప్పారు.

త‌న‌కు ఫైనాన్స్ అవ‌స‌రం లేద‌ని ఆ యువ‌తి చెప్పిన‌ప్ప‌టికి వారు బ‌ల‌వంతంగా ఇంట్లోకి వ‌చ్చారు. ఓ వ్యక్తి ఇంటి బ‌య‌ట కాపాలా ఉండ‌గా.. మ‌రో వ్య‌క్తి యువ‌తిపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం వారు అక్క‌డ నుంచి ప‌రార‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు యువ‌తి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని యువ‌తిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బీఎస్ మ‌క్తా ప‌రిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ప‌రిశీలిస్తున్నారు.




Next Story