అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు మహిళ దారుణ హత్య
డబ్బుల వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 10:40 AM ISTఅప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు మహిళ దారుణ హత్య
డబ్బుల వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇద్దరు ఆడవాళ్లు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దాంతో.. ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎల్బీనగర్ శివగంగా కాలనీలో నివాసం ఉంటున్న నర్సమ్మ అనే మహిళకు ఇంటి పక్కనే ఉంటున్న సరోజినీతో మంచి పరిచయం ఉంది. ఇదరూ ప్రతిరోజు మాట్లాడుకునేవారు. ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత నమ్మకం వచ్చింది. దీంతో సరోజినీ ఒకరోజు నర్సమ్మను అత్యవసరంగా డబ్బులు కావాలని అడిగింది. అడిగిన వెంటనే నర్సమ్మ తన వద్ద ఉన్న 20వేల రూపాయలను సరోజినీకి అప్పుగా ఇచ్చింది. అప్పటి నుండి సరోజిని ప్రవర్తనలో మార్పు వచ్చింది. 20 వేల రూపాయలను తిరిగి ఇవ్వమని నర్సమ్మ అడిగింది. కానీ ఆమె రోజులు దాటవేస్తూనే వచ్చింది. రోజులు గడుస్తూనే ఉన్నాయి. దాంతో కోపంతో నర్సమ్మ తన డబ్బులు తనకి ఇవ్వమని సరోజిని గట్టిగా అడిగింది. ఇద్దరు మధ్య వాగ్వివాదం చెలరేగింది.
ఈ గొడవ కాస్త తీవ్ర స్థాయికి చేరుకోవడంతో సరోజినీ ఆగ్రహానికి లోనై పక్కనే ఉన్న స్తుతితో ఒక్క సారిగా నర్సమ్మ ముఖంపై చితకబాదింది. దీంతో నర్సమ్మకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితురాలు సరోజినిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.