గుంటూరు జిల్లాలో దారుణం.. వివాహితపై హత్యాచారం
Woman Murder after harassment in Guntur District.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. విజయవాడ
By తోట వంశీ కుమార్ Published on 28 April 2022 12:42 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లాలో వివాహిత హత్యాచార ఘటన కలకలం రేపింది. తొలుత అనుమానాస్పద మృతిగా బావించిన పోలీసులు, మృతదేహాంపై గాయాలను బట్టి అత్యాచారం జరిగినట్లు నిర్థారణకు వచ్చారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వీరంకి లక్ష్మీ తిరుపతమ్మ(40), శ్రీనివాసరావు దంపతులు నివసిస్తోంది. పొలాలకు నీళ్లు పెట్టే ట్యూబులను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతికి వెలుతుంటాడు. కాగా.. బుధవారం మధ్యాహ్నాం సమయంలో తిరుపతమ్మ బంధువైన ఓ యువకుడు ఆమెను కలిసేందుకు ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో అచేతనంగా పడి ఉండగా.. ఒంటిపై దుస్తులు లేవు. వెంటనే అతడు పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు, గొంతుపై గట్టిగా నులిమినట్లు ఉన్నట్లు గుర్తించారు. సంఘటనాస్థలంలో నిందితులు తాగిపడేసిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్తకు విషయాన్ని తెలియజేయగా.. తాను ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు చెప్పాడు. వెంటనే స్వగ్రామానికి బయలుదేరి వస్తున్నట్లు, మృతిపై అనుమానాలు ఉన్నట్లు చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.