రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో దారుణం.. భ‌ర్త‌ను కొట్టి భార్య‌పై సామూహిక అత్యాచారం

Woman molested in Repalle railway station.వ‌ల‌స కూలీలైన ఆ దంప‌తులు అర్థ‌రాత్రి రైల్వే స్టేష‌న్‌లో నిద్రించ‌డ‌మే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2022 9:05 AM IST
రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో దారుణం.. భ‌ర్త‌ను కొట్టి భార్య‌పై సామూహిక అత్యాచారం

వ‌ల‌స కూలీలైన ఆ దంప‌తులు అర్థ‌రాత్రి రైల్వే స్టేష‌న్‌లో నిద్రించ‌డ‌మే శాప‌మైంది. ముగ్గురు వ్య‌క్తులు భ‌ర్త‌ను కొట్టి భార్య‌ను ప‌క్క‌కు తీసుకువెళ్లి ఆమె పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న బాప‌ట్ల జిల్లా రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. వ‌ల‌స కూలీలైన ఆ దంప‌తులు అవ‌నిగ‌డ్డ‌లో ప‌నుల కోసం నిన్న అర్థ‌రాత్రి స‌మ‌యంలో రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌ల్‌లో దిగారు. ఆ స‌మ‌యంలో బ‌స్సులు లేవు.రేప‌ల్లెలో వారికి తెలిసిన వారు కూడా లేక‌పోవ‌డంతో రైల్వే స్టేష‌న్‌లోనే ప‌డుకుని ఉద‌యాన్నే అవ‌నిగ‌డ్డ‌కు వెళ్లాల‌ని అనుకున్నారు. రైల్వే స్టేష‌న్‌లోని బ‌ల్ల‌ల మీద ప‌డుకున్నారు.

అయితే.. ఓ ముగ్గురు వ్య‌క్తులు బ‌ల్ల‌పై నిద్రిస్తున్న మ‌హిళ‌ను ప‌క్క‌కు తీసుకువెళ్లేందుకు య‌త్నించ‌గా.. ఆమె భ‌ర్త అడ్డుకున్నాడు. ముగ్గురు వ్య‌క్తులు భ‌ర్త‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. అనంత‌రం అత‌డి భార్య‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. బాధిత దంప‌తుల నుంచి వివ‌రాలు సేక‌రించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితుల‌ను ప్ర‌కాశం జిల్లా ఎర్ర‌గొండ‌పాలెంకు చెందిన వారిగా గుర్తించారు.

Next Story