దారుణం.. ప్రియుడితో కలిసి కన్నకొడుకును చంపిన తల్లి
Woman kills son help her lover kadapa district. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్న కొడుకును కడతేర్చింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం
By అంజి Published on 30 Dec 2022 12:19 PM ISTఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్న కొడుకును కడతేర్చింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం ఏపీలో జరిగింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంకు చెందిన మారుతి నాయక్ 14 ఏళ్ల కిందట బెంగళూరుకు చెందిన కవిత అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్న ఈ కుటుంబం.. ఇటీవలే ఖాజీపేటలోని చెమ్మళ్లపల్లెకు వచ్చి స్థిరపడింది. ఈ క్రమంలోనే లారీ డ్రైవర్ మారుతి నాయక్‌కు అదే వృత్తిలో చేస్తున్న వినోద్ అనే యువకుడితో పరిచయైంది.
ఈ క్రమంలోనే వినోద్ తరచుగా మారుతి నాయక్ ఇంటికి వస్తూ పోతుండే వాడు. ఈ క్రమంలోనే వినోద్ కవితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 3 నెలల కిందట వినోద్, కవితలు ఇద్దరు పిల్లలను తీసుకుని పారిపోయారు. ఆ తర్వాత బద్వేలులోని రూపరాంపేటలో ఓ రూమ్ రెంట్‌కు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. అయితే భార్య, పిల్లలు కనిపించకపోయే సరికి మారుతి నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కవిత, వినోద్‌లు బద్వేలులో ఉన్నట్లు మారుతి నాయక్‌కు తెలిపింది. ఆ వెంటనే అతడు తన సోదరితో బద్వేలుకు వచ్చి కవితను ప్రశ్నించాడు.
అదే సమయంలో అక్కడే ఉన్న వినోద్ పరారయ్యాడు. కూతురు ఒక్కతే ఉంది, కొడుకు ఎక్కడ అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మారుతినాయక్ బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అర్బన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రాత్రి సమయాల్లో బాలుడు ఎక్కువగా ఏడుస్తున్నాడని ప్రియుడు, తల్లి హత్య చేశారని సమాచారం. ఇంటి ఆవరణలోని ఖాళీస్థలంలో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చివేసినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.