కూతురిని గుడ్డతో ఛాతీకి కట్టుకుని.. కాలువలోకి దూకిన తల్లి

Woman kills self, 8-year-old daughter. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నాడు విరోచన్‌నగర్‌లో

By అంజి  Published on  24 Feb 2022 7:37 AM GMT
కూతురిని గుడ్డతో ఛాతీకి కట్టుకుని.. కాలువలోకి దూకిన తల్లి

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నాడు విరోచన్‌నగర్‌లో 23 ఏళ్ల మహిళ తన ఎనిమిదేళ్ల కుమార్తెను తన ఛాతీకి గుడ్డతో కట్టుకుని కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రిపోర్ట్‌ ప్రకారం.. మృతుడి బంధువు అర్జన్ భర్వాద్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. సనంద్ తాలూకాలోని సచనా గ్రామంలో ఉన్న తండ్రి ఇంటికి మహిళ చెహర్ భర్వాద్, ఆమె కుమార్తె రుత్వి భర్వాద్ వెళ్లారు. ఆదివారం వారిద్దరూ గుడికి వెళ్లిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం వరకు వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.

మంగళవారం వీరి మృతదేహాలను నర్సింహపుర బ్రాంచ్ కెనాల్ నుంచి బయటకు తీశారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం సనంద్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. చెహర్ తన సొంత కూతురిని చంపినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. మహిళ చెహర్‌ ఛాతీకి తన 8 ఏళ్ల కుమార్తెను గుడ్డతో కట్టుకుని, ఆపై కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it