తల్లిని చంపిన కూతురు.. మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టుకుని.. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు

39 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ నిరంతరం గొడవపడి తన తల్లిని క్రూరంగా చంపింది. ఆపై మహిళ తన తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి నగరంలోని

By అంజి  Published on  13 Jun 2023 9:39 AM IST
Woman kills mother, Bengaluru, Crime news

తల్లిని చంపిన కూతురు.. మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టుకుని.. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు

మానవ సంబంధాలు మంటగలసి పోతున్నాయి. రక్త సంబంధికులు అని కూడా చూడా దారుణాలకు తెగబడుతున్నారు కొందరు. బెంగళూరులో తాజాగా మరో దారుణ ఘటన జరిగింది. కన్న తల్లి అన్న కనికరం లేకుండా కూతురు అతి కిరాతకానికి పాల్పడింది. నగరంలోని 39 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ నిరంతరం గొడవపడి తన తల్లిని క్రూరంగా చంపింది. ఆపై మహిళ తన తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి నగరంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు.

బెంగళూరులోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితురాలు మృతదేహంతో నింపిన సూట్‌కేస్‌ను మైకో లేఅవుట్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. ఆ తర్వాత నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిత్యం తనతో గొడవ పడుతుండడంతో తల్లిని హత్య చేసినట్లు మహిళ అంగీకరించింది. నిందితురాలు వివాహిత అని, నేరం జరిగిన సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. మహిళ అత్తగారు ఇంట్లో ఉన్నారని, అయితే గదిలో హత్య జరిగినందున ఆమెకు తెలియదని వారు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story