పెళ్లికి నిరాక‌రించిన ప్రియుడు.. చంపేసిన ప్రేయ‌సి

Woman kills his lover for not marry in ap.రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.పెళ్లికి నిరాకరించాడని ప్రియుడ్ని చంపేసిని ప్రేయసి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2021 4:23 AM GMT
lover murded

ఆ ఇద్ద‌రికి ఒక‌రంటే మ‌రొక‌రికి ఇష్టం. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గ‌త కొంత‌కాలంగా త‌న‌ను పెళ్లి చేసుకోమ‌ని ప్రియురాలు ప్రియుడిని అడుగుతోంది. అయితే.. ఆ ప్రియుడు పెళ్లి విష‌యం వ‌చ్చిన ప్రతిసారి దాట‌వేస్తూ వ‌స్తున్నాడు. త‌న‌ను కాక వేరొక‌రిని ప్రేమిస్తున్నాడ‌న్న అనుమానంతో ప్రియుడిని హ‌త్య చేసింది ప్రియురాలు. ఈ దారుణ ఘ‌ట‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు మండ‌లం ధ‌ర్మ‌వ‌రం-కాప‌వ‌రం గ్రామాల మ‌ధ్య చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలంలోని మలకపల్లికి చెందిన గర్సికూటి పావని తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో పెళ్లి చేసుకుందామంటూ పావని ఏడాదిగా అడుగుతున్నా తాతాజీ నిరాకరిస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం తాతాజీ బైక్‌పై పంగిడి వచ్చాడు. అక్కడ పావని అతడిని కలిసింది. రాత్రి వరకు ఇద్దరూ అక్కడే తిరిగిన అనంతరం బైక్‌పై మలకపల్లి బయలుదేరారు. ఈ క్రమంలో వెనక కూర్చున్న పావని సంచిలో వెంట తెచ్చుకున్న కత్తి తీసి తాతాజీని వెనక నుంచి పొడిచింది. దీంతో కింద ప‌డిపోయాడు తాతాజీ. వెంట‌నే అత‌ని మెడ‌, త‌ల, వీపుపై పొడిచింది. తీవ్ర‌గాయాలైన తాతాజీ అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story
Share it