రేపు పెళ్లి.. పొలంలో శవమై తేలిన యువతి

రేపు పెళ్లి జరగాల్సిన ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది.

By అంజి
Published on : 3 Dec 2023 11:29 AM IST

Woman killed, marriage, Uttar Pradesh, Prayagraj

రేపు పెళ్లి.. పొలంలో శవమై తేలిన యువతి

రేపు పెళ్లి జరగాల్సిన ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని దలాపూర్ గ్రామంలో పెళ్లికి ఒక రోజు ముందు, ఒక యువతి పొలంలో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. రీనా (20) మృతదేహం శనివారం సాయంత్రం పొలంలో కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) అభిషేక్ భారతి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మహిళ బావమరిది తారా చంద్ర బింద్ ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడితో కలిసి మహిళ గతంలో మూడుసార్లు పారిపోయిందని, 10 రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చినట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. విచారణలో రీనా అక్క మీనా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం బింద్.. రీనాను వేరే చోట పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించాడని చెప్పినట్లు అభిషేక్ తెలిపారు.

Next Story