కపిల్‌ శర్మ షోలో పని ఇప్పిస్తానని నమ్మించి.. యువతిపై వ్యక్తి అత్యాచారం

ప్రముఖ టాక్ షో - ది కపిల్ శర్మ షోలో పని ఇప్పిస్తాననే నెపంతో ముంబైలో 26 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని అధికారులు తెలిపారు.

By అంజి  Published on  27 May 2024 2:03 PM IST
Mumbai, Kapil Sharma show, Crime news

కపిల్‌ శర్మ షోలో పని ఇప్పిస్తానని నమ్మించి.. యువతిపై వ్యక్తి అత్యాచారం

ప్రముఖ టాక్ షో - ది కపిల్ శర్మ షోలో పని ఇప్పిస్తాననే నెపంతో ముంబైలో 26 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని అధికారులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడు ఆనంద్ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు, మహిళ కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్‌లో కలిశారు. టీవీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులతో తనకు సంబంధాలు ఉన్నాయని, ది కపిల్ శర్మ షోలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆనంద్ ఆ మహిళను మోసం చేశాడు.

ఆ మహిళ ఆనంద్ మాటలకు పడిపోయింది. అతను షోలో పని చేయడానికి ఆడిషన్ ఇవ్వవలసి ఉంటుందని ఆమెకు చెప్పాడు. ఆడిషన్ బాగా జరిగితే క్యాస్టింగ్ డైరెక్టర్ దగ్గరకు తీసుకెళ్తానని కూడా చెప్పాడు. ఆడిషన్ ఇవ్వడానికి పాల్ఘర్ జిల్లా నలసోపరా ప్రాంతంలో ఉన్న ఆనంద్ ఇంటికి మహిళ వెళ్లింది. ఆడిషన్ నెపంతో నిందితుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో శారీరకంగా దాడి చేసి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడని పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన తర్వాత, మహిళ పోలీసులను ఆశ్రయించింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (అత్యాచారం), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. కేసు నమోదు చేసిన తరువాత, పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అక్కడ తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి తరలించారు.

Next Story