దారుణం.. భర్త ఎదురుగా భార్యపై సామూహిక అత్యాచారం
Woman gang raped by 3 in front of her husband.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళపై
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2021 12:07 PM ISTదేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కండ్లు మూసికుపోయిన కామాంధులు నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. బైక్‌పై వెలుతున్న దంపతులను అడ్డుకున్న దుండగులు భర్తను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం దంపతులిద్దరికి కారులోకి ఎక్కించారు. భర్త ఎదురుగా భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బార్మెర్‌కు చెందిన దంపతులు మంగళవారం బలోత్రాలోని తమ బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో నలుగురు దుండగులు వీరిని అడ్డగించారు. అందులో ఒకడు ద్విచక్రవాహనాన్ని తీసుకెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురు భర్తను కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించారు. భర్త పక్కనే కూర్చొనివుండగా ఆ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని ఓ ప్రాంతంలో వదిలివేసి వెళ్లారు.
తేరుకున్న బాధితురాలు.. భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబులాల్, నరేష్, కమ్తాయ్ ఈ దారుణానికి పాల్పడినట్లుగా గుర్తించి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.