చదువుకుంటానని చెప్పినా బలవంతంగా పెళ్లి.. యువతి ఆత్మహత్య

పురుగుల మందు తాగి గత ఎనిమిది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల యువతి ఏప్రిల్ 22 సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరణించింది.

By అంజి
Published on : 23 April 2024 8:15 PM IST

suicide, Crime, Bhadradri Kothagudem district

చదువుకుంటానని చెప్పినా బలవంతంగా పెళ్లి.. యువతి ఆత్మహత్య

హైదరాబాద్: పురుగుల మందు తాగి గత ఎనిమిది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల యువతి ఏప్రిల్ 22 సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరణించింది. రిపోర్ట్స్‌ ప్రకారం.. ఆమె ఉన్నత చదువుల ఆకాంక్షలను విస్మరించి, ఆమె కుటుంబం ఆమెను వివాహం చేసుకోమని బలవంతం చేసింది. బాధితురాలు దేవకి వ్యవసాయ కూలీల కూతురు. ఇటీవలే బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ఆమె తదుపరి చదువుపై ఆసక్తి చూపింది.

బాధితురాలు తన చదువును కొనసాగించాలనే కోరిక గురించి తన తల్లికి చెప్పింది, కానీ ఆమె తల్లి, ఆరోగ్య సమస్యలను ఉటంకిస్తూ, వివాహం మరింత సరైన మార్గమని ఆమెను ఒప్పించింది. మార్చి 28న దుబ్బతండా గ్రామానికి చెందిన యువకుడితో దేవకి వివాహం జరిగింది. వివాహ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 14న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన ఆమె.. రాత్రి సమయంలో కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో పురుగుమందులు తాగింది.

అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఎనిమిది రోజుల పాటు చికిత్స పొందుతూ దేవకి సోమవారం తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Next Story