పానీపూరి తెచ్చిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య
Woman ends life after tiff with husband over bringing street food at home.ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే
By తోట వంశీ కుమార్ Published on 1 Sept 2021 1:37 PM ISTఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న కష్టానికే తనువు చాలిస్తున్నారు. నాన్న తిట్టాడనో, అమ్మ కొట్టిందనో, ప్రేయసి మాట్లాడలేదనో కారణం ఏదైనప్పటికి చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక భార్యా భర్తల మధ్యల చిన్న చిన్న గొడవలు రావడం సహజం. ఇరువురు సర్దుకుపోవాలి. అయితే.. భర్త తనను అడగకుండా పానీపూరీ తెచ్చాడని ఆగ్రహించిన భార్య.. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 2019లో షోలాపూర్‌కు చెందిన గహినీనాథ్ సర్వదేకి, ప్రతీక్ష కు వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. గహినీనాథ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరు పూణెలోని అంబేగావ్ పీఠభూమి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రోజు మాదిరిగానే ఆఫీస్‌కు వెళ్లిన గహినీనాథ్ సాయంత్రం వచ్చేటప్పుడు పానీపూరి పార్సిల్ తీసుకువచ్చాడు. భార్య ప్రతీక్షకు ఇచ్చాడు.
అయితే.. తనను అడగకుండా పానీపూరి ఎందుకు తెచ్చావని ప్రతీక్ష.. గహినీనాథ్‌తో గొడవకు దిగింది. పానిపూరీ తినేందుకు నిరాకరించింది. మరుసటి రోజు అతడికి టిపిన్ బాక్స్‌ను ఇవ్వలేదు. ఇంకా కోపం తగ్గలేదని గహినీనాథ్ ఏమీ మాట్లడకుడా ఆఫీసుకు వెళ్లాడు. అతడు ఆఫీసుకు వెళ్లిన తరువాత ప్రతీక్ష విషం తాగింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రతీక్ష మరణించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.