దారుణం.. వైద్యురాలిని చంపి, ఆత్మహత్యకు యత్నంచిన ప్రియుడు
వృత్తిరీత్యా డాక్టర్ అయిన జమ్మూలో ఒక మహిళ, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. జంట ఒక సమస్యపై గొడవ పడ్డారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 March 2023 3:44 PM ISTవైద్యురాలిని చంపి, ఆత్మహత్యకు యత్నంచిన ప్రియుడు
వృత్తిరీత్యా డాక్టర్ అయిన జమ్మూలో ఒక మహిళ, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. జంట ఒక సమస్యపై గొడవ పడ్డారని పోలీసులు తెలిపారు. ఆగ్రహానికి గురైన వ్యక్తి వంటగదిలో ఉండే కత్తితో ప్రియురాలిని పొడిచాడు. అతను అదే కత్తితో తన జీవితాన్ని కూడా ముగించడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. వైద్యురాలిని జమ్మూలోని తల్లాబ్ తిల్లో నివాసి సుమేధా శర్మగా గుర్తించారు. నిందితుడిని పాంపోష్ కాలనీలో నివసిస్తున్న జోహార్ గనైగా గుర్తించారు.
కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా జోహార్ తన జీవితాన్ని ముగించుకోబోతున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడని నిందితుడి బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు జమ్మూలోని జానీపూర్‌లోని జోహార్ ఇంటికి వెళ్లారు. ఇంటి గేటుకు తాళం వేసి ఉండడంతో పోలీసులు ఇంట్లోకి చొరబడి చూడగా రక్తపు మడుగులో సుమేధ మృతదేహం కనిపించింది. నిందితుడి కడుపులో గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించినా సుమేధ ప్రాణాలతో బయటపడలేదు. అయితే నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసి ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు, బాధితురాలు సంబంధంలో ఉన్నారని, వారు జమ్మూలోని డెంటల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) చదివారని తెలిపింది. సుమేధ తరువాత ఎండీఎస్ చదవడానికి జమ్మూ నుండి వెళ్ళింది. ఆమె మార్చి 7వ తేదీన హోలీ కోసం ఇంటికి వచ్చి తన ప్రియుడి ఇంట్లో ఉన్న సమయంలో గొడవపడ్డారు. నిందితుడు ఆమెను కత్తితో పొడిచాడు. ఈ విషయంపై నిందిత, బాధిత కుటుంబాలు ఇంకా స్పందించలేదు. పోలీసులు చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.