Hyderabad: బంజారాహిల్స్‌లో బస్సు ఢీకొని మహిళ మృతి
బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందింది.
By అంజి Published on 17 Dec 2023 10:30 AM ISTHyderabad: బంజారాహిల్స్‌లో బస్సు ఢీకొని మహిళ మృతి
హైదరాబాద్ నగరంలో రెండు వేరువేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆదివారం ఉదయం బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందింది. బంజారాహిల్స్‌లోని ఎల్‌వీ ప్రసాద్ హాస్పిటల్ సమీపంలో రోడ్డు దాటుతుండగా సుమారు 35 ఏళ్ల బాధితురాలు అతివేగంతో వెళ్తున్న మహిళను ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఓజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు చంద్రకళ(35) వనస్థలిపురంలో నివాసం ఉంటూ పార్క్ హయత్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నది.
ఇదిలా ఉంటే.. ఎల్బీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎల్బీనగర్ లోని చింతలకుంట వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మీతిమిరిన వేగంతో అటు ఇటు వెళ్తూ రోడ్డు మీద నానా హంగామా సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఆ కారు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది. వెనకాల నుండి బలంగా ఢీకొట్టడంతో బొడ్డుపల్లీ మహేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.