అత్యాచారం చేయబోతే.. మ‌ర్మాంగాన్ని కొడవలితో కోసేసింది

Woman cuts off man's genitals after he tries to rape her.అత్యాచారం చేయ‌బోయిన కామాందుడికి ఓ మ‌హిళ త‌గిన గుణ‌పాఠం చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2021 11:39 AM IST
Woman cuts off mans genitals after he tries to rape her

అత్యాచారం చేయ‌బోయిన కామాందుడికి ఓ మ‌హిళ త‌గిన గుణ‌పాఠం చెప్పింది. భ‌ర్త ఇంట్లో లేని స‌మ‌యంలో అర్థ‌రాత్రి ఇంట్లోకి దూకిన ఓ కామాంధుడు మ‌హిళ‌పై అఘాయిత్యానికి య‌త్నించాడు. ఆ మృగాడితో దాదాపు 20 నిమిషాల పాటు ధైర్యంగా పెనుగులాడిన ఆమ‌హిళ‌ చివ‌రికి ఆ కామాంధుడి మ‌ర్మాంగాన్ని కోసేసింది. అనంత‌రం అత‌డి నుంచి త‌ప్పుకుని పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి జ‌రిగిందంతా చెప్పింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది. ఖాదీ ప్రాంత ఎస్సై ధ‌ర్మేంద్ర సింగ్ రాజ్‌పుత్ తెలిపిన వివ‌రాల మేర‌కు.. సిధి జిల్లా ఖాడ్డీ పోలీస్ స్టేషన్ పరిధి ఉమరిహా గ్రామానికి చెందిన మహిళ (45) భర్త పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాడు.

దీంతో ఆమె తన 13ఏళ్ల కొడకుతో ఇంట్లో ఉంది. అర్థ‌రాత్రి నిందితుడు(45) ఇంట్లోకి చొర‌బ‌డ్డాడు. దొంగ‌లు ప‌డ్డార‌ని బావించిన ఆమె కొడుకు ఇరుగుపొరుగు వారిని పిలిచేందుకు బ‌య‌ట‌కు ప‌రుగులు తీశాడు. ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. అత‌డు ఆమెను కొట్టి అత్యాచారం చేసేందుకు య‌త్నించాడు. ఆమె భ‌య‌ప‌డ‌కుండా అత‌డికి ఎదురుతిరిగింది. దాదాపు 20నిమిషాల‌కు పైగా నిందితుడిని నిలువ‌రించింది. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మంచం కింద ఉన్న కొడవలి తీసుకుని అతడి మర్మాంగాలను కోసేసింది. అనంత‌రం పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ప్రస్తుతం మరో ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నారు.




Next Story