దారుణం.. ప్రియురాలికి తెలిసిన నిజం.. దాన్ని క‌ట్ చేసేసింది

Woman 'cut off cheating boyfriend's genitals. ప్రియురాలికి ఓ షాకింగ్ నిజం తెలిసింది, ఘాడ నిద్ర‌లోకి జారుకున్నాడు. ఇదే మంచి అవ‌కాశం అని బావించిన ఆ యువ‌తి వెంట‌నే క‌త్తితో అత‌డి అంగాన్ని కోసేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 2:15 PM GMT
woman cut off gentils

ఆ ఇద్ద‌రు ప్రేమించుకున్నారు. స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్రియురాలికి ఓ షాకింగ్ నిజం తెలిసింది. అంతే ఆమెలోని ఆగ్ర‌హాం క‌ట్ట‌లు తెంచుకుంది. ప్రియుడికి బుద్ది చెప్పాల‌ని అనుకున్న‌ది. వెంట‌నే త‌న ఆలోచ‌న‌ను అమ‌లులోకి తెచ్చింది. ఎప్ప‌టిలాగే ఆ రోజు రాత్రి కూడా తాగి వ‌చ్చాడు అత‌డు. అనంత‌రం ఘాడ నిద్ర‌లోకి జారుకున్నాడు. ఇదే మంచి అవ‌కాశం అని బావించిన ఆ యువ‌తి వెంట‌నే క‌త్తితో అత‌డి అంగాన్ని కోసేసింది. ఈ ఘ‌ట‌న తైవాన్‌లో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. చాంఘువా కౌంటీలోని జిహుటౌన్‌షిప్‌లో 52 ఏళ్ల హువాంగ్‌ తన ప్రియురాలు పుంగ్‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. వారిద్ద‌రు స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. వారికి ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. అయితే.. ఈ క్ర‌మంలో పుంగ్ కు ఓ రోజు షాకింగ్ నిజం తెలిసింది. అదేంటంటే.. హువాంగ్ త‌న‌తోనే కాక మ‌రో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు అని. అంతే.. పుంగ్‌లోని ఆగ్ర‌హాం క‌ట్ట‌లు తెంచుకుంది. ఆ రోజు కూడా హువాంగ్ తాగి వ‌చ్చాడు. వెంట‌నే నిద్ర‌లోకి జారుకున్నాడు. ఇదే అదునుగా బావించిన పుంగ్.. హువాంగ్ అంగాన్ని ప‌దునైన క‌త్తితో కోసేసింది. అనంత‌రం దాన్ని బాత్రూంలో పడేసి ఫ్లష్‌ చేసింది.

ఇంత జ‌రిగినా అత‌డికి మెలుకువ రాలేదు. ఉద‌యాన్నే నిద్రలేచిన త‌రువాత అంగం వ‌ద్ద నొప్పిగా అనిపించ‌డంతో పాటు బెడ్ షీట్ అంతా ర‌క్తం ఉండ‌డంతో.. చూసుకోని భ‌య‌ప‌డిపోయాడు. ప్రియురాలి కోసం కేక‌లు వేశాడు. ఆమె రాక‌పోవ‌డంతో ప‌డిపోయిన అంగం కోసం వెతికాడు. అయినా ప్ర‌యోజనం లేక‌పోయింది. నొప్పిని త‌ట్టుకోలేక వెంట‌నే ఆస్ప‌త్రికి ఫోన్ చేశాడు. అంబులెన్స్‌ వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడికి డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. మూత్రం మార్గంలో ప్రత్యేకంగా సర్జరీ చేశారు. కాగా.. ఈ ఘ‌ట‌న అనంత‌రం పుంగ్ నేరుగా వెళ్లి పోలీసుల‌కు లొంగి పోయింది. తొలుత హువాంగ్‌కు ఈ ప‌ని ఎవ‌రు చేశారో అర్థం కాక‌పోయినా.. త‌రువాత అస‌లు విష‌యం తెలిసింది. కాగా.. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
Next Story
Share it