అఫైర్ ఉందని.. ఆమెను ఏమి చేశారంటే?

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో పెళ్ళైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఓ మహిళను అర్ధనగ్నంగా ఊరేగించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 14 April 2024 5:05 PM IST

woman, affair,  married man, viral video,

అఫైర్ ఉందని.. ఆమెను ఏమి చేశారంటే? 

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో పెళ్ళైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఓ మహిళను అర్ధనగ్నంగా ఊరేగించారు. ఈ ఘటనను ఆదివారం నాడు పోలీసులు కూడా ధృవీకరించారు. సర్వాది గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు యాక్షన్ కు దిగారు. ఇలాంటి పని ఎవరు ప్రేరేపిస్తే చేశారో చెప్పాలంటూ వాకబు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తికి మహిళతో ఉన్న సంబంధం గురించి భార్య, కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధితురాలిని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అర్ధనగ్నంగా ఉన్న బాధితురాలిని ఒక మహిళ ఈడ్చుకుపోతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. సమ్‌దారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.

Next Story