మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అనంతపురం జిల్లా యాడికిలోని తన నివాసంలో బుధవారం రాత్రి ఆయన మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. నిద్రపోయిన సమయంలో అనారోగ్యంతోనే గంగాధర్‌రెడ్డి మృతిచెందినట్లు అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి అనుచరుడు. వివేకా హత్య కేసులో గంగాధర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే మూడుసార్లు విచారించింది. కాగా.. తనుకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఇప్పటికే రెండుసార్లు జిల్లా ఎస్పీని కలిసి గంగాధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.