భ‌ర్త ఉద్యోగం త‌న‌కు వ‌స్తుంద‌ని.. భార్య ఘాతుకం

Wife murdered husband in Bhadradri Kothagudem District.భ‌ర్త తాగి వ‌చ్చి నిత్యం వేధింపుల‌కు గురిచేస్తుండ‌డంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2023 8:39 AM IST
భ‌ర్త ఉద్యోగం త‌న‌కు వ‌స్తుంద‌ని.. భార్య ఘాతుకం

భ‌ర్త తాగి వ‌చ్చి నిత్యం వేధింపుల‌కు గురిచేస్తుండ‌డంతో ఓ మ‌హిళ విసిగిపోయింది. భ‌ర్త‌ను హ‌త‌మారిస్తే కారుణ్య నియామ‌కం కింద అత‌డి ఉద్యోగం త‌న‌కు వ‌స్తుంద‌న్న ఆలోచ‌నతో అత‌డిని హత్య చేసింది. అనంత‌రం జారి కింద ప‌డి మ‌ర‌ణించాడు అని అంద‌రిని నమ్మించే ప్ర‌య‌త్నం చేసింది. చివ‌ర‌కు పోలీసుల విచార‌ణ‌లో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. కొత్త‌గూడెం క‌లెక్ట‌రేట్‌లో శ్రీనివాస్(50) అటెండ‌ర్‌గా ప‌ని చేస్తుండేవాడు. గ‌త నెల 29న అర్థ‌రాత్రి అత‌డు వంటింట్లో జారి ప‌డ‌డంతో త‌ల‌కు తీవ్ర‌మైన గాయమైంద‌ని అత‌డి భార్య సీతామ‌హాల‌క్ష్మి ఆయ‌న్ను ఆస్ప‌త్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ అత‌డు మ‌ర‌ణించాడు. తండ్రి మ‌ర‌ణంపై అనుమానం ఉందంటూ కొడుకు సాయికుమార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. సీతామ‌హాల‌క్ష్మీ త‌న భ‌ర్త‌ను ఆస్ప‌త్రిలో చేర్పించిన త‌రువాత నుంచి అదృశ్య‌మైంది.

దీంతో ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్ వెళ్లేందుకు కొత్త‌గూడెం రైల్వే స్టేష‌న్‌కు ఆమె రాగా అదుపులోకి తీసుకున్నారు. విచారించ‌గా భ‌ర్త తాగిన మైకంలో ఇంటికి వ‌చ్చాడ‌ని, అత‌డు నిద్ర‌పోయిన త‌రువాత త‌ల‌పై కర్ర‌తో కొట్టి, వంట గ‌దిలో తీసుకువెళ్లి ప‌డుకోబెట్టిన‌ట్లు నిందితురాలు చెప్పిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Next Story