భర్త చనిపోగానే సంబరాలు చేసుకున్న భార్య.. అసలు విషయం ఏమిటంటే..!
Wife got husband killed and then celebrated.బీహార్‌లోని పూర్నియా లో ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా భర్తను
By M.S.R Published on 24 Feb 2022 1:31 PM ISTబీహార్‌లోని పూర్నియా లో ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా భర్తను హత్య చేసింది. ఆ తర్వాత హత్య జరిగిందన్న ఆనందంలో ఆమె తన ప్రేమికుడిని ఓ బహుమతిని కూడా అడిగింది. ఈ కేసు వెలుగులోకి రావడంతో పూర్నియా జిల్లాలో చర్చనీయాంశమైంది.
మరంగా పోలీస్ స్టేషన్‌లోని సత్సంగ్ దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 31 రాత్రి డ్రగ్స్ డీలర్ మోహన్ చంద్ర దాస్ కాల్చి చంపబడ్డాడు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ వ్యాపారికి సంబంధించిన కేసు కావడంతో ఎస్పీ దయాశంకర్ దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేశారు. సదరు డీఎస్పీ సురేంద్ర కుమార్ సరోజ్ నేతృత్వంలో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల ఆధారంగా షూటర్ రామన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాల్పులు జరిపిన రామన్‌ను పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. షూటర్ నోటి నుంచి హత్య వెనుక ఉన్న పన్నాగాలను విని పోలీసులు కంగుతిన్నారు. వ్యాపారి భార్య చుమ్కీ దాస్, ఆమె ప్రియుడు ఆయుష్ కుమార్, షూటర్ రమణ్ కుమార్‌తో పాటు మనీష్ కుమార్, గౌరవ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సురేంద్ర కుమార్ సరోజ్ తెలిపారు. వ్యాపారవేత్త భార్య చుమ్కీ దాస్, ఆయుష్ కుమార్ నాలుగేళ్లుగా అక్రమ సంబంధం కలిగి ఉన్నారని తేలింది. దీనిపై సదరు వ్యాపారి నిత్యం అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. భర్త కారణంగా చుమ్కీ ఆయుష్‌తో జీవించలేకపోయింది. దీంతో ప్లాన్ వేసిన భార్య.. భర్తను హత్య చేయించింది . భర్త చనిపోగానే భార్య సంబరాలు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.