దారుణం.. భర్త మర్మాంగాన్ని కోసి హత్య చేసిన భార్య

Wife cuts private part of her husband in Maharshtra.మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపుర్​ లో దారుణం జ‌రిగింది. భ‌ర్త పెట్టే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2022 9:34 AM IST
దారుణం.. భర్త మర్మాంగాన్ని కోసి హత్య చేసిన భార్య

మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపుర్​ లో దారుణం జ‌రిగింది. భ‌ర్త పెట్టే బాధ‌లు భ‌రించ‌లేక ఓ భార్య ఘాతుకానికి ఒడిగ‌ట్టింది. అనుమానంతో నిత్యం భ‌ర్త త‌న‌ను చిత్ర హింస‌లు పెడుతుండ‌డంతో ఆ భార్య అత‌డి త‌ల‌పై రాయితో బాది, మ‌ర్మాంగాన్ని క‌త్తితో కోసి హ‌త‌మార్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. శాహువాడీలోని లోలనే గ్రామానికి చెందిన ప్రకాశ్ పాండురంగ కాంబ్లే(52), వందన(50) దంప‌తులు కొద్ది నెల‌లుగా మంగుర్వాడీలోని ఓ వ్య‌వ‌సాయ క్షేత్రంలో ప‌నిచేస్తున్నారు. ఈక్ర‌మంలో వంద‌న‌కు వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానంతో ప్రకాశ్ నిత్యం తాగి వ‌చ్చి ఆమెను కొడుతూ ఉండేవాడు. రోజు రోజుకు ఈ వేదింపులు అధికం అవుతున్నాయే త‌ప్ప ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం అర్థ‌రాత్రి వారిద్ద‌రి మ‌ధ్య మ‌రోసారి గొడ‌వ జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఆవేశానికి లోనైన వంద‌న ప‌క్క‌నే ఉన్న రాయిని తీసుకుని భ‌ర్త త‌ల‌పై మోదింది. అనంత‌రం క‌త్తితో భ‌ర్త మ‌ర్మాంగాన్ని కోసేసింది. దీంతో అత‌డు మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసి వంద‌న‌ను అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story