ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అని ట్యాంక్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు మృతి చెందారు.
పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఆవరణలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేసేందుకు మొదట ఓ కార్మికుడు ట్యాంక్‌లోకి దిగాడు. ఆ తరువాత ఒకరి తరువాత మరొకరు మొత్తం ఏడుగురు కార్మికులు లోపలికి దిగారు. ఊపిరి ఆడక ఏడుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను ట్యాంక్‌లోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన వారు కాగా.. మిగిలిన ఐదుగురు పాడేరు వాసులుగా గుర్తించారు. ఈ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉందని, ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్ధం వినిపించని పలువురు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.