పదేళ్ల కొడుకును చంపిన తల్లి.. తన లెస్బియన్ సంబంధాన్ని తెలుసుకున్నాడని..

ఓ మహిళ తన ప్రియురాలి సహాయంతో తన కొడుకును హత్య చేసింది. కొడుకు తన లెస్బియన్ సంబంధాన్ని తెలుసుకున్నాడని తల్లి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది

By అంజి  Published on  21 Feb 2024 7:18 AM IST
West Bengal, lesbian affair, Crime news

పదేళ్ల కొడుకును చంపిన తల్లి.. తన లెస్బియన్ సంబంధాన్ని తెలుసుకున్నాడని..

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియురాలి సహాయంతో తన కొడుకును హత్య చేసింది. కొడుకు తన లెస్బియన్ సంబంధాన్ని తెలుసుకున్నాడని తల్లి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది. నిందితురాలు బాలుడి తలపై పలుమార్లు కొట్టి చేతులు నరికినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. శాంత శర్మ అనే మహిళ తన వివాహానికి ముందు ఇష్రత్ పర్వీన్‌తో సంబంధం కలిగి ఉంది. ఇటీవల శాంత శర్మ 10 ఏళ్ల కుమారుడు ఆమె లెస్బియన్ సంబంధాన్ని తెలుసుకున్నాడు.

ఆ తర్వాత శర్మ తన రహస్యాన్ని ఇతరులకు వెల్లడిస్తానని భయపడ్డాడనని పోలీసులు తెలిపింది. శాంత శర్మ మరో మహిళతో ఉన్న సంబంధం గురించి ఆమె భర్తకు తెలుసునని, అయితే పబ్లిక్ అవమానం భయంతో మౌనంగా ఉండటాన్ని ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ టవర్ లొకేషన్లు, ఫోరెన్సిక్ సాక్ష్యాలను విశ్లేషించినప్పుడు నేరుగా ఇష్రత్ పర్వీన్, శాంత శర్మలను నేరస్థులుగా చూపడంతో ఈ కేసులో పురోగతి వచ్చింది.

Next Story