మామ మర్మాంగాన్ని కోసిన కోడలు.. ఎందుకంటే..?
West Bengal woman cuts off her father-in law testicles.పుట్టింటికి వెళ్లడానికి భర్త ఒప్పుకోలేదు. ఆగ్రహించిన భార్య
By తోట వంశీ కుమార్ Published on 29 Sept 2022 9:52 AM ISTపుట్టింటికి వెళ్లడానికి భర్త ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన భార్య తన అత్త, మామలతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో దారుణానికి ఒడిగట్టింది. మామ మర్మాంగాలను కోసి పడేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మైనా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు మేదినీపుర్ పోలీస్స్టేషన్ పరిధికి చెందిన శిఖా అనే మహిళ తన భర్త, అత్తమామలతో కలిసి నివసిస్తోంది. ఓ రోజు శిఖా తండ్రి ఆమెకు ఫోన్‌కు చేశాడు. ఇంట్లో మాంసం వండామని భోజనానికి ఇంటికి రావాలని కోరాడు. శిఖా వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. తాను వెళ్తానని చెప్పింది. అయితే.. భర్త ఇందుకు నిరాకరించాడు.
వచ్చేటప్పుడు తాను ఇంటికి చికెన్ తీసుకువస్తానని, ఇంట్లోనే వండుకుని తిందామని చెప్పాడు. దీంతో కోపంతో కాల్ కట్ చేసింది శిఖా. అనంతరం ఇదే విషయంగా ఇంట్లో ఉన్న అత్తమామలతో గొడవకు దిగింది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరగా.. ఆగ్రహంతో ఊగిపోతూ శిఖా.. తన మామ మర్మాంగాన్ని కత్తితో కోసి పడేసింది. వీరి గొడవతో అక్కడకు స్థానికులు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడి బాధతో విలవిల లాడుతున్న మామను ఆస్పత్రికి తరలించారు. శిఖాను పట్టుకుని బంధించారు. అయితే.. వారి నుంచి తప్పించుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
అత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శిఖాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం ఆమెకు 14 రోజులు కస్టడీ విధించింది.