విషాదం.. కూలిన మిద్దె.. ఆరుగురు మృతి
Wall Collapses Six Members Died in Jogulamba Gadwal Dist.నిద్రిస్తున్న వారిపై గోడ కూలడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 10 Oct 2021 3:20 AM GMT
నిద్రిస్తున్న వారిపై గోడ కూలడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో చోటు చేటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామంలో మోష, శాంతమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం. ప్రతిరోజు లాగాగే శనివారం రాత్రి భోజనం అనంతరం ఆ కుటుంబం నిద్రపోయింది. అయితే.. ఆదివారం తెల్లవారుజూమున మిద్దె కూలీ వారిపై పడింది. ఈ ఘటనలో భార్య భర్తలతో పాటు ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుంగా.. మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా.. మట్టి మిద్దె కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఒకే కుటుంబంలో ఆరుగురు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.