తూర్పుగోదావ‌రి జిల్లాలో బాలిక‌పై గ్రామ వాలంటీర్ అత్యాచారం

Village Volunteer molested minor girl in East Godavari District.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2022 3:42 AM GMT
తూర్పుగోదావ‌రి జిల్లాలో బాలిక‌పై గ్రామ వాలంటీర్ అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట వారిపై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. కామంతో క‌ళ్లు మూసుకుపోయి కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల‌కు వార‌ధిగా ఉంటూ సేవ‌లు అందించాల్సిన గ్రామ‌సేవ‌కులు కొంద‌రు పెడ‌దారి ప‌డుతున్నారు. ఇంటింటి వెలుతూ.. ఓ బాలిక‌తో ప‌రిచ‌యం పెంచుకున్న గ్రామ వలంటీరు.. అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో గ్రామ వాలంటీర్ గా బూసి స‌తీష్(23) ప‌నిచేస్తున్నాడు. ఇంటింటికి వెలుతున్న క్ర‌మంలో ఓ బాలిక‌తో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఇటీవ‌ల బాలిక ఇంట్లో ఎవ‌రూ లేనిది చూసి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. విష‌యాన్ని ఎవ‌రికి చెప్పొద్ద‌ని బెదిరించాడు. బాలిక భ‌య‌పడి విష‌యాన్ని ఎవ‌రికి చెప్ప‌లేదు. బాలిక ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు ఆరా తీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆదివారం బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుల‌కు పిర్యాదు చేశారు. పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు బాలిక‌ను చికిత్స నిమిత్తం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితుడి అరెస్ట్ చేసి విచార‌ణ చేప‌ట్టారు.

Next Story
Share it