'ఆ బీజేపీ ఎమ్మెల్యేను ఫినిష్‌ చేయ్‌.. కోటి ఇస్తాను' సంచలనం రేపిన వీడియో

Video of Cong leader 'planning murder' of BJP MLA SR Vishwanath goes viral.క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Dec 2021 2:53 AM GMT
ఆ బీజేపీ ఎమ్మెల్యేను ఫినిష్‌ చేయ్‌.. కోటి ఇస్తాను సంచలనం రేపిన వీడియో

క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఓ బీజేపీ ఎమ్మెల్యే హ‌త్య‌కు ఆయ‌న చేసిన కుట్ర ప్ర‌స్తుతం క‌ర్ణాటక‌ రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేను హ‌త్య చేస్తే కోటి రూపాయ‌లు ఇస్తానంటూ స‌ద‌రు కాంగ్రెస్ నేత‌ ఓ వ్య‌క్తితో మూడు నిమిషాల పాటు మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం పెద్ద దుమారాన్నే రేపుతోంది. దీంతో పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. ఇంత‌కీ ఎవ‌రా కాంగ్రెస్ నేత‌..? ఎవ‌రా బీజేపీ ఎమ్మెల్యే అనేది ఇప్పుడు చూద్దాం.

య‌ల‌హంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వ‌నాధ్‌ను హ‌త్య చేయాల‌ని క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌కుడు గోపాల‌కృష్ణ ఓ వ్య‌క్తితో మాట్లాడుతున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోలో ఏం ఉందంటే..? ' ఆ బీజేపీ ఎమ్మెల్యేని(విశ్వనాథ్‌) ఫినిష్‌ చేయ్‌. నీకు కోటి రూపాయలు ఇస్తాను. ఈ విష‌యం గురించి ఎవ్వ‌రికి తెలీదు. మనిద్ద‌రి మ‌ధ్యే ఉంటుంది' అని గోపాలకృష్ణ‌ అవతలి వ్యక్తికి తో మాట్లాడాడు.

దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఈ వీడియో ఎప్ప‌టిది..? ఏ రోజు జ‌రిగింది అన్న‌దానిపై స్ప‌ష్ట‌మైన స‌మాచారం లేదు. దీనిపై క‌ర్ణాట‌క హోంశాఖ మంత్రి మాట్లాడుతూ.. పోలీసులు ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకున్నార‌న్నారు. ఎఫ్ఐఆర్ దాఖ‌లు చేస్తున్నార‌న్నారు. విశ్వనాథ్ తనతో మాట్లాడినట్టు చెప్పారు. ఎమ్మెల్యేకు భద్రత కల్పిస్తామ‌న్నారు. అయితే భ‌ద్ర‌త ఇవ్వాలా.. వ‌ద్దా అన్న‌ది ఇంట‌లిజెన్స్ విభాగం చేతుల్లో ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Next Story
Share it